కేటీఆర్ కు బిగ్ షాక్.. నిలిచిపోయిన వాట్సాప్ సేవలు

-

రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కు వాట్సాప్ సంస్థ షాక్ ఇచ్చింది. ఆయన వాట్సాప్ ఖాతాను నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాలి వేలికి గాయమై ప్రస్తుతం కేటీఆర్.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

“నిన్నటి నుంచి మూడు సార్లు నా వాట్సాప్ ఖాతాలో సేవలు నిలిచిపోయాయి. నా ఖాతాకు ఎనిమిది వేలకుపైగా సందేశాలు వచ్చాయి. వీలైనంత వరకు వాటికి సమాధానమివ్వడానికి ప్రయత్నించాను. కానీ ఆ ప్రయత్నంలో మూడు సార్లు నా వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. ఇప్పటికి 24 గంటలు గడిచింది నా వాట్సాప్ ఖాతా సేవలు నిలిచిపోయి. డిజిటల్ సవాళ్లు చాలా క్లిష్టంగా ఉంటాయి.” అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడి కాలి వేలికి గాయం కావడంతో.. తెరాస నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. దగ్గరి వాళ్లు ఆయన వాట్సాప్ ఖాతాకు సందేశాలు పంపుతున్నారు. ఆ సందేశాలతో ఫ్లో ఎక్కువై వాట్సాప్ ఖాతా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. విశ్రాంతి సమయంలో కేటీఆర్.. ఏవైనా ఓటీటీ సినిమాలు చెప్పండి చూస్తానని నెటిజన్లను కోరారు. దీనిపై ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, జీ5 స్పందించి తమ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న పలు సినిమాలు, సిరీస్ లు చూడమని సూచించాయి.

మరోవైపు కేటీఆర్ తనకు దెబ్బ తగిలినా.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ.. మరోవైపు ఇంటి నుంచే పని చేస్తున్నానని తెలిపారు. వర్క్ ఫ్రం హోం అంటూ తాజాగా ఆయన ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news