ఈ ఎన్నికల్లో మేము కింగ్ కానున్నాం : కుమారస్వామి

-

‘ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే రోజులు కావి ఇవి” అని జనతాదళ్ సెక్యులర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుండగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఇచ్చిన మీడియాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తమ పార్టీ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

తొక్కలో సర్వేలది ఏముంది అన్నా ?, కాబేయే సీఎం నేను, లీడర్ ధీమా ! | sensational comments of HD Kumaraswamy who expressed confidence that he is the future CM of Karnataka - Telugu Oneindia

ఎన్నికల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాము గెలిచే అవకాశమున్న 25 అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ పార్టీకి గట్టి దెబ్బ తగలనుందని అయినప్పటికీ ఈ ఎన్నికల్లో తాము కింగ్ కానున్నామని జేడీఎస్ నాయకుడు హెచ్ డీ కుమారస్వామి అన్నారు. తనకు బాధ కలిగించే విషయం ఏమిటంటే తాను తన అభ్యర్థులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల పరంగా పక్కన పెడితే తాము ప్రజల మద్దతు పొందగలమని భావిస్తున్నట్లు చెప్పారు. గెలిచిన అభ్యర్థులు ఉన్న అనేక నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపురలో మాదిరిగా చివరి దశలో అభ్యర్థులను ఆర్థికంగా ఆదుకోవడంలో విఫలమయ్యామన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news