ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వర్షాకాలంలో కూడా వేడిగా ఉన్నాయి. టీడీపీ నేత కూన రవికుమార్ మంత్రి కొడాలి నాని పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 74 వ సంవత్సర దినోత్సవం వేడుకలకు మంత్రి కొడాలి నాని శ్రీకాకుళం హాజరయ్యారు. అయితే కొందరు కుమార్ ఈ విషయం ప్రస్తావన చేస్తూ పోలీస్ కుక్క కూడా కొడాలి నానికి గౌరవం ఇవ్వలేదని.. గౌరవ నమస్కారం కూడా చేయలేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసలు కొడాలి నాని కి గౌరవం ఎందుకు ఇవ్వాలని, దమ్ముంటే వైయస్సార్ సిపి పార్టీ నాయకులు రాజీనామా చేసి మరల ఎన్నికలకు వెళ్లాలని అన్నారు.
సందర్భం దొరికితే చాలు చంద్రబాబు నాయుడు పై వ్యాఖ్యలు చేయడం తప్పా పరిపాలన చేయడం చేతకాదని. అందుకే హై కోర్ట్ ఎప్పటికప్పుడు మొట్టికాయలు వేస్తుందని, అయినా సిగ్గు లేకుండా పరిపాలన సక్రమంగా చేయడం లేదని ఆరోపించారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడం ఇష్టంలేక టిడిపి పార్టీ కేసులు పెట్టిందని ప్రజలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కేసులు పెట్టింది ప్రజలేనని అక్రమంగా భూములు లాక్కున్నారని కేసులు పెట్టారని అన్నారు.