భాగ్యనగరంలో భారీ వర్షాలు.. కంట్రోల్‌ రూం ఏర్పాటు

-

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు జలమయం అయ్యి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని డీఆర్ఎఫ్ హెచ్చరించింది. బేగంపేట్, కుత్బుల్లాపూర్‌, తిరుమలగిరి, అల్వాల్‌, బోయిన్‌పల్లి, జవహర్‌నగర్‌, బొల్లారం, మారేడుపల్లి, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్‌, హబ్సిగూడ ప్రాంతాల్లో భారీవర్షం పడుతోంది.

మరికొన్ని గంటల పాటు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 040-21111111, 9000113667కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ లో డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమైంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news