సీపీఐ కూనంనేని సాంబశివరావు సంచ లన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేశారు కూనంనేని. లేకపోతే.. త్వరలోనే గవర్నర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరికలు చేశారు. గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పడం అంటే వివాదం తెచ్చుకునే ఆలోచనలో ఉందని.. ఫోన్ ట్యాప్ జరిగితే కేంద్రం లో మీ ప్రభుత్వం ఉంది కదా..? అని నిలదీశారు.
విచారణ చేసి చర్యలకు అదేశించాలని.. గవర్నర్ తమిళిసై ఇలాంటి మాటలు సరికాదని చురకలు అంటించారు. ఢిల్లీ ఆదేశాలకు అనుగుణంగా గవర్నర్ పని చేస్తోందని ఆరోపణలు చేశారు. నా ట్విట్టర్ అకౌంట్ రద్దు చేశారని..ఫేస్ బుక్ కూడా అలాగే చేశారని ఫైర్ అయ్యారు. అమిత్ షా, మోడీ లు క్రిమినల్స్ అని.. వారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. మాపై కేసులు ఉన్నా.. అవి ధర్నాలు చేసినవేనని.. క్రిమినల్స్ పాలిస్తున్న దేశంగా ఇండియా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఐ కూనంనేని సాంబశివరావు.