బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్యకు ఆగంతకుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ మేరకు ఆయన హోం మంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆగంతకుల నుంచి ఫోన్ కాల్స్ వస్తుండటంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, గెల్లు శ్రీనివాస్ కు మద్దతు ఇచ్చినప్పటి నుంచి ఫోన్ లో బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ నెంబర్ ఫేస్బుక్ లో పెట్టి బెదిరిస్తున్నట్లు తెలిపాడు. రెండు రోజుల నుంచి బెదిరింపులు తీవ్రమైనట్లు తెలిపారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చినందుకే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ లో ఈటెలకు మద్దతు ఇవ్వనందుకే బెదిరింపులు వస్తున్నాయన్నారు. రెండు రోజులుగా వెయ్యికి పైగా ఫోన్లు వచ్చాయని తెలిపారు. ఈ ఫోన్ల వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని హోంమంత్రి, డీజిపీకి వినతి పత్రం అందించానని ఆర్. క్రిష్ణయ్య వెల్లడించారు. కొన్ని శక్తులు నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని.. గత 40 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి పనిచేస్తున్నా అని ఆర్. క్రిష్ణయ్య అన్నారు.
ఆర్. క్రిష్ణయ్యకు బెదిరింపు కాల్స్.. టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినప్పటి నుంచే..
-