టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తు్న్నారు. ఈ పిక్చర్ నుంచి ఏదేని అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. RRR ఫిల్మ్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. కాగా, ఇందులో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది.
అయితే ఈ చిత్రానికి.. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. దాంతో గతంలో అధికారి, సర్కారోడు వంటి టైటిల్స్ తెరపైకొచ్చాయి. అయితే.. ఈ సినిమాలో మరో హీరోయిన్ కనిపించబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ స్పెషల్ ఎపిసోడ్ లో హీరోయిన్ ఖుష్బూ నటించబోతుందట. ఈ పాత్ర ఈ సినిమా మొత్తం లోనే చాలా కీలకమని, అందుకే శంకర్ ఈ పాత్ర కోసం కుష్బూ ను ఎంపిక చేసుకున్నాడు అని టాక్ నడుస్తోంది.