ఎస్బీఐలో అకౌంట్ ఉందా? ఇలా చెయ్యకుంటే అకౌంట్ క్లోజ్ అవుతుంది..

-

భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.తన కస్టమర్లకు ఆన్‌లైన్‌లో చాలా సౌకర్యాలను అందిస్తుంది. ఈ ముఖ్యమైన సౌకర్యాలలో ఒకటి KYC పూర్తి చేసుకోవడం. మీరు ఇప్పటివరకు kyc పూర్తీ చెయ్యకుంటే మాత్రం మీ ఖాతాను కూడా స్తంభింపజేయవచ్చు అంటే మూసివేయవచ్చు. దీని తర్వాత మీరు మీ ఖాతా నుండి ఎలాంటి లావాదేవీలు చేయలేరు.మీరు మీ KYC వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. తద్వారా మీరు బ్రాంచ్‌ని సందర్శించకుండానే ఇంటి నుండి KYC పత్రాలను అందించవచ్చు.

ఆన్‌లైన్ లో kyc ని ఎలా అప్డేట్ చెయ్యాలి?

KYC కోసం డాక్యుమెంట్‌లను సమర్పించే ముందు, KYC వివరాలను అప్‌డేట్ చేయడానికి మీరు సంభంధిత పత్రాలను బ్యాంక్‌కి సమర్పించాలి.

KYC కి కావలసిన పత్రాలు:

పాస్పోర్ట్

ఓటర్ ID కార్డ్

డ్రైవింగ్ లైసెన్స్

ఆధార్ కార్డ్ /

NREGA కార్డ్

పాన్ కార్డ్

మైనర్లకు అవసరమైన KYC పత్రాలు..

మైనర్ ఖాతాదారుడి వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తి ID రుజువును సమర్పించాలి.

KYC చేయడానికి దశల వారీ ప్రక్రియ..

కస్టమర్లు తమ అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్‌ను స్కాన్ చేసి, తమ బ్రాంచ్ అధికారిక మెయిల్ ఐడీకి పంపాలి.

మీ KYC పత్రం పూర్తి కానట్లయితే మీ KYC పత్రాన్ని ఆన్‌లైన్‌లో పంపండి.

పంపవలసినవి పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, NREGA కార్డ్, పాన్ కార్డ్‌తో పాటు మీ చిరునామా రుజువు.

మైనర్ వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే. ఆ మైనర్ ఖాతాను నిర్వహించే వ్యక్తి గుర్తింపు కార్డు ఇవ్వవలసి ఉంటుంది.

ఖాతాదారుడి వయస్సు 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, వారు కూడా అందరిలాగే KYC పత్రాలను అందించాలి..

Read more RELATED
Recommended to you

Latest news