జల వివాదంపై బీజేపీ ఫోకస్.. ఇవాళ కీలక సమావేశం

-

కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న జల వివాదాలపై ఏపీ బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. ఇటీవల కాలంలో ఇరు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విస్తరణ పనులు ప్రారంభించడంతో ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటలయుద్దం నడుస్తోంది. తమ నీళ్లకు తీసుకెళ్తున్నారని తెలంగాణ నేతలు, మా వాటానే మేం వాడుకుంటున్నామని ఏపీ నేతలు అంటున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు కేంద్రం పరిష్కరించాలని అంటున్నారు. రాష్ట్ర బీజేపీ చొరవతీసుకోవాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలు నడుంబిగించారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు ఇవాళ బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కర్నూలు నగరంలో ఈ సమావేశానం కానున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరుకానున్నారు. రాయలసీమ నీటి అవసరాలపై చర్చించనుననారు. అంతేకాదు రాయలసీమ బీజేపీ నేతలు, కార్యకర్తలు, పలు సంఘాల నేతల సూచనలు, సలహాలను స్వీకరించనున్నారు. నేతల అభిప్రాయాలు, అనుమానాలను కూడా తెలుసుకుని నివృత్తి చేసే అవకాశం ఉంది. అంతేకాదు రాయలసీమకు చెందిన బీజేపీ నేతలు అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రాయలసీమ అవసరాలను బట్టి నీళ్లపై నివేదిక తయారు చేసి కేంద్రానికి సమర్పిస్తారని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వాటర్ సమస్య పరిష్కారమవుతోందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news