పని చేయించుకుని డబ్బులివ్వలేదని.. బెంజ్‌ కారుకు నిప్పు పెట్టిన కూలీ

-

పనిచేయించుకున్నాడు. డబ్బులడిగితే నో అన్నాడు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నోసార్లు తన పనికి తనకు వచ్చే డబ్బులివ్వాలని యజమానిని వేడుకున్నాడు ఆ కూలీ. కానీ అతడు ససేమిరా అన్నాడు. యజమాని తీరుతో విసిగిపోయిన కూలీ కోపంతో అతడికి చెందిన ఖరీదైన కారుకు నిప్పుపెట్టాడు. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ -39లో చోటుచేసుకుంది.

జలాల్‌పుర్‌ గ్రామానికి చెందిన రణ్‌వీర్‌.. నోయిడాలోని సదర్‌పుర్‌ కాలనీకి చెందిన ఆయుష్‌ చౌహాన్‌ ఇంట్లో టైల్స్‌ పని చేశాడు. ఇందుకు సంబంధించి రణ్‌వీర్‌కు ఆయుష్‌ రూ.68వేలు ఇవ్వాల్సి ఉంది. అనేక సార్లు వచ్చి అడిగినా ఆయుష్‌ డబ్బులు ఇవ్వలేదు.

దీంతో విసిగిపోయిన రణ్‌వీర్‌.. మంగళవారం సదర్‌పుర్‌ కాలనీకి బైక్‌పై వచ్చాడు. ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న మెర్సిడెజ్‌ బెంజ్‌ కారుపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి.. పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బైక్‌ నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా పోలీసులు రణ్‌వీర్‌ను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news