హైదరాబాద్‌ శివారులో లేడీ బ్యూటీషియన్‌ మర్డర్‌..శవం నుంచి దుర్వాసన !

-

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో యువతి మృత దేహం కలకలం రేపుతోంది. అత్తాపూర్ చింతల్ మెట్ లోని ఓ అపార్ట్‌మెంట్ లో ఓ యువతి అనుమానాస్పద స్థితి మృతి చెందింది. ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆ యువతి.. అయితే… అపార్ట్‌మెంట్ వాసులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. వారితో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగాయి. అపార్ట్‌మెంట్ లోని ఆ యువతి ప్లాట్ లో నుండి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు అపార్ట్‌మెంట్ వాసులు.

ఇక హుటాహుటిన అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు… ఫ్లాట్ తలుపులు బద్దలు గొట్టి లోపలికి వెళ్లారు. అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. అయితే.. మృతురాలిని అర్యాన్ ఖాన్ గా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. అర్యాన్ ఖాన్…బ్యూటీషియన్ గా పని చేస్తుందని.. గత కొంత కాలంగా ఓ యువకుడి తో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే..ప్రస్తుతం ఆ యువకుడు పరారీలో ఉన్నాడు. దీంతో ఆ యువకుడి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news