ప్రశాంతంగా ఉన్న లగచర్లను ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ పేరుతో లంకలా మార్చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆ గిరిజన రైతులు తిరగబడ్డారని పేర్కొన్నారు. కానీ ఆ అధికారులపై దాడి చేయడం వారి అభిమతం కాదని.. భూ సేకరణను అడ్డుకోవాలని మాత్రమే వారు అలా చూశారని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులకు అప్పులు పెట్టుబడుల పై ఏమాత్రం అవగాహన అసలే లేదని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ పెద్దలు ప్రజలను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో సమాధానం చెప్పాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం లగచర్ల ఘటనపై రోజుకో మాట మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.