నన్ను వదిలేయండి….లగడపాటి..

-

సర్వేలతో వార్తల్లో నిలిచి ఉన్న పరువు పోగొట్టుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెరాస అధినేత పేరేత్తితేనే దండం పెడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో రాజగోపాల్  శుక్రవారం మధ్యాహ్నం భేటీ  భేటీ అయ్యారు. దీంతో కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌పై వారు లగడపాటిని  ప్రశ్నించగా.. తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఫెడరల్ ఫ్రంట్‌పై తానేమీ మాట్లాడనని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఓ పత్రికకు చెందిన విలేకరు ఏదో ప్రశ్న అడుగుతుండగా తెలంగాణ గురించి నన్ను ఏమి అడగొద్దు..నన్ను వదిలేయండి అంటూ దండం పెట్టుకుంటు వెల్లిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దెబ్బతో  2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాజగోపాల్ ఈ మధ్య తెలంగాణలో జరిని ఎన్నికల తర్వాత మరో సారి యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రజాకూటమిదే విజయమని తాను చేయించిన సర్వే ఫలితాల్లో వివరించగా… చివరికి ఆ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం సృష్టించడంతో ఉన్న ఫీజులు సైతం ఎగిరిపోయి నాటి నుంచి మీడియా ముందుకు రానీ లగడపాటి ఒక్కసారిగా అమరావతిలో ప్రత్యక్ష మయ్యారు. అయితే తెరాస నేతలు సైతం లగడపాటి రాజగోపాల్ ఏపీ సీఎం చంద్రబాబు ఏజెంట్ అని, ఆయన సలహాతో తప్పుడు సర్వేను ప్రకటించారని టీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూటమి గురించి కూడా లగడపాటి ప్రస్తావించడానికి భయపడటం అందరిని ఆశ్చర్యపరిచింది.

Read more RELATED
Recommended to you

Latest news