నాగశౌర్య ‘లక్ష్య’ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్‌ యుంగ్‌ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా సినిమా లక్ష్య. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో… తెరకెక్కుతున్న ఈ సినిమా కు ధీరేంద్ర సంతోష్‌ జాగర్ల పూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా ? అని ఎదురు చూస్తున్న సినీ లవర్స్ కోసం కొత్త అప్ డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం.

లక్ష్య సినిమా ను డిసెంబర్‌ 10 వ తేదీన… థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. కాగా.. ఈ సినిమా ను సోనాలి నారంగ్‌, నారాయణ్‌ దాస్‌ కే నారంగ్‌, పీ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ, హీరోయిన్‌ గా నటిస్తోది. ఇక ఈ సినిమా లో నాగశౌర్య క్రీడా కారుడి పాత్రలో కనిపించ బోతున్నాడు. ఇక తాజాగా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటన చేయడంతో నాగ శౌర్య ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.