Lakshya Review : నాగశౌర్య “లక్ష్య” మూవీ రివ్యూ..

-

వరుడు కావలెను సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నాగ శౌర్య…” లక్ష్య “సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విలువిద్య నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా సినిమా అనే ఈ లక్ష్య. సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా… కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, రవి ప్రకాష్, సత్య, వైవా హర్ష లాంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర వహించారు. ఇక ఈ సినిమాకు నారాయణ దాస్ కె నా రంగు, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరించారు.

కథ : హీరో నాగ శౌర్య.. ఈ సినిమాలో పార్ధు గా నటించాడు. పార్ధు తండ్రిగా రవి ప్రకాష్ కీ రోల్ చేశారు. ఈ సినిమాలో పార్ధు తండ్రి వాసు ఆర్చరీ ప్లేయర్. అయితే ఆర్చరీ పోటీలకు వెళుతుండగా అనుకోకుండా ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. దీంతో తన తండ్రి స్ఫూర్తి కారణంగా పార్ధు కూడా.. ఆర్చరీ పోటీలోకి దిగుతాడు. అక్కడి నుంచే సినిమా మొదలవుతుంది. ఒక హీరో పార్ధు కు అతని తాతయ్య రఘురామయ్య (సచిన్ ఖేడేకర్) చాలా సపోర్ట్ చేస్తాడు. చిన్ననాటి నుంచి ఆర్చరీ పై ఫోకస్ చేసిన పార్ధు.. కురుక్షేత్ర అనే ఆర్చరీ అకాడమీలో చేరుతాడు. పార్ధు ఎంతో కష్టపడి రాష్ట్రస్థాయి ఛాంపియన్ అవుతాడు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ కేతిక శర్మ పరిచయం అవుతుంది. వారిద్దరూ లో పడతారు. ఈ నేపథ్యంలోనే హీరో తాతయ్య మరణిస్తాడు. దీంతో పాటు ఆయన లైఫ్ లో అనుకోని సంఘటన చోటు చేసుకుంటుంది. తెరపై ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు.. పార్ధు మళ్లీ ఆర్చరీ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తారు. చివరికి పార్ధు కష్టాలను దాటుకొని వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ ఎలా గెలిచాడు ? అసలు జగపతి బాబు ఎవరు ? పార్ధు జీవితంలో కేతిక శర్మ పాత్ర ఏంటి ? అనేది తెలియాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
నాగ శౌర్య నటన
ఎమోషనల్ సన్నివేశాలు
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్

మాస్ ఆడియన్స్ కు ఎక్కకపోవడం
సన్నివేశాలు తేలిపోవడం
ముందే అంచనా వేసే సీన్స్.

రేటింగ్ : 2.50

Read more RELATED
Recommended to you

Latest news