BIG ALERT : సివిల్స్‌ పరీక్ష దరఖాస్తుకు నేడే ఆఖరు

-

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2023కు దరఖాస్తులకు నేడే ఆఖరి రోజు. మొత్తం 1,105 సివిల్ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 1 నుంచి మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ.. ఈరోజు సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందినవారు, ప్రస్తుతం డిగ్రీ ఆఖరి ఏడాది అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లో https://upsconline.nic.in దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయో పరిమితి 2023 ఆగస్టు 1 నాటికి 21 ఏళ్లు నిండి 32 ఏళ్ల మధ్య ఉండాలని యూపీఎస్సీ తెలిపింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌ పరీక్ష మే 28న జరగనుంది. ఆ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ప్రతిభ కనబరిచిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానించి అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడిస్తారు. ప్రిలిమ్స్‌ పరీక్షకు మూడు వారాల ముందు ఈ-అడ్మిట్‌ కార్డులను జారీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news