వరంగల్‌పై రేవంత్ ఫోకస్..వెస్ట్ సీటు ఆయనకే ఫిక్స్!

-

టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెలుతున్న విషయం తెల్సిందే..హత్ సే హత్ కార్యక్రమంలో భాగంగా రేవంత్ ఫిబ్రవరి6న పాదయాత్ర మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకెళుతున్నారు. రేవంత్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ క్రమంలోనే ఆయన వరంగల్ లో పాదయాత్ర చేస్తున్నారు. వరంగల్ లో పాదయాత్ర విజయవంతంగా ముందుకెళుతుంది.

ఈ క్రమంలోనే ఆయన వరంగల్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. గతంలో జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది..కానీ నిదానంగా అక్కడ బి‌ఆర్‌ఎస్ హవా మొదలైంది. జిల్లాపై బి‌ఆర్‌ఎస్ పట్టు బిగించింది. అయితే అక్కడ కొందరు బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్ బలం పెంచేలా రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎక్కడకక్కడ బలమైన అభ్యర్ధులని బరిలో దింపేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా కీలక స్థానాల్లో అభ్యర్ధులని దాదాపు ఫిక్స్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఆయన వరంగల్ సిటీపై ఫోకస్ పెట్టారు. అక్కడ పాదయాత్ర చేసిన ఆయన..వరంగల్ ఈస్ట్, వెస్ట్ స్థానాల్లో ఉన్న బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌లపై విరుచుకుపడ్డారు.  నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్ ఇద్దరు బిల్లా, రంగా లాంటి వారు అని,  వరంగల్ ఎమ్మెల్యేలు దండుపాళ్యం బ్యాచ్ లాంటివారని, భూకబ్జాలలో వీరికి మించిన వాళ్లు ఇంకెవరూ లేరు అంటూ ఫైర్ అయ్యారు.

అదే సమయంలో వీరిపై కాంగ్రెస్ నుంచి కీలక నేతలని బరిలో దింపడానికి రెడీ అయ్యారు. వరంగల్ ఈస్ట్ లో కొండా సురేఖ గాని, ఆమె కుమార్తె గాని పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల బరిలో తానే ఉంటానని రేవంత్ రెడ్డి ముందే ప్రకటించారు. పక్క జిల్లాల నుండి ఎవరొచ్చినా, వేరే పార్టీల నుండి ఎవరొచ్చినా సరే వరంగల్ పశ్చిమ స్థానం నుండి తానే పోటీలో ఉంటానని చెప్పేశారు. దీంతో రెండు స్థానాల్లో నేతలు ఫిక్స్ అయ్యారు. మరి వీరు..బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు చెక్ పెడతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news