ఉపాధి కోల్పోయిన వారికి కేంద్రం గుడ్ న్యూస్..!

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఈ మహమ్మారి వలన చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

కరోనా వైరస్ కాలంలో ఉపాధఇ కోల్పోయిన వారికి తీపికబురు తీసుకు వచ్చింది కేంద్రం. అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఉద్యోగులకి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని అనుకుంటోంది కేంద్రం. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న అటల్ మీమిత్ వ్యక్తి కల్యాణ్యోజన పథకం గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.

అయితే ఈ స్కీమ్ 2022 జూన్ వరకు కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఎవరైనా ఉపాధి కోల్పోయిన వారు కనుక ఉంటే వాళ్ళు అలవెన్స్ పొందొచ్చు. పరిస్థితుల ఇంకా అలానే కొనసాగుతుండటంతో 185వ ఈఎస్ఐసీ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అని వెల్లడించారు. ఉపాధి కోల్పోయిన వారికి ఈఎస్‌ఐ నుంచి ఆర్థిక సాయం లభిస్తుంది. అదే విధంగా కుటుంబ సభ్యులకు ఈఎస్ఐసీ మెడికల్ ఫెసిలిటీ 6 నెలల వరకు ఉంటుంది. ఈఎస్ఐ లబ్ధిదారులు ఉద్యోగం కోల్పోతే మూడు నెలల వరకు సగం జీతం ఇస్తారు. మూడు నెలల కాలంలో ఉపాధి కోల్పోయిన వారు మళ్లీ ఉద్యోగం సంపాదించుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు.