‘టక్ జగదీశ్’ కు ఫిక్స్ అయిన హీరోయిన్లు

-

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా, ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ రూపోందించిన నిన్నుకోరి చిత్రం ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఫెయిల్యూర్ లవ్ స్టోరీగా వ‌చ్చిన ఈ సినిమా అంద‌రిని ఆక‌ట్టుకోవ‌డంతో బ్లాక్ బ‌స్టర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా త‌ర్వాత రియ‌ల్ క‌పుల్ అయిన నాగ‌చైత‌న్య, స‌మంత జంట‌గా శివ నిర్వాణ రూపోందించిన మజిలీ కూడా మంచి విజయాన్నే దక్కించుకుంది. దీంతో త‌న త‌దుప‌రి చిత్రాన్ని మళ్లీ నానితో చేసేందుకు శివ ప్లాన్ చేశాడు. ‘టక్ జగదీశ్’ పేరుతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభం కావ‌ల్సిఉండ‌గా క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో జూన్ 6వ తేదికి షిప్ట్ అయ్యింది. ఈ సినిమాలో నాని లుక్ చాలా స్టైలిష్ గా ఉండబోతోందని తెలుస్తోంది. నాని సరసన హీరోయిన్లుగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కనిపించనున్నారు.

ఈ మధ్య వచ్చిన సినిమాల్లో జగపతి బాబుకి సరైన పాత్ర దక్కలేదు. మళ్లీ జగపతిబాబు గురించి మాట్లాడుకునేలా ఈ సినిమాలో ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో థమన్ సంగీతం కూడా అలరించబోతోంది. నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తోన్న వీరి కాంబో మళ్లీ హిట్ కొడుతుందో లేదో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news