“జగనన్న టౌన్‌ షిప్‌” స్కీమ్‌ ప్రారంభం..సొంత ఇండ్లులేని అందరికీ లబ్ది

-

ఏపీలో జగనన్న టౌన్‌ షిప్‌ స్కీమ్‌ ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే.. ఎమ్ఐజీ వెబ్ సైట్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు సీఎం జగన్. ఎమ్ఐజీ పథకం కింద మధ్య తరగతి వర్గాలకు హౌసింగ్ అవకాశం కల్పించనున్న ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు ఇవాల్టి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనుంది.

ఇందులో భాగంగానే.. ఎమ్ఐజీ వెబ్ సైట్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. రూ. 18 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలకు తక్కువ ధరకు నివాస స్ధలం కేటాయించటం ఈ పథకం ఉద్దేశమని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రకటన చేశారు. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, కడప జిల్లా రాయచోటిలో లే అవుట్లు వేయనున్నట్లు స్పష్టం చేశారు సీఎం జగన్‌. ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో కూడా ఫస్ట్ ఫేజ్ లో లే ఔట్లు ప్రారంభిస్తామన్నారు. ప్రతి నియోజక వర్గంలో… జగనన్న టౌన్‌ షిప్‌ స్కీమ్‌ ప్రారంభం అవుతుందని తెలిపారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news