జగన్ ఫార్ములాతో బాబు.. సక్సెస్ అవుతారా!

-

రాజకీయాల్లో సక్సెస్ ఫార్ములాలని ఎప్పుడు ఎవరైనా వాడుకోవచ్చు…సక్సెస్ ఫార్ములా అని తెలిసాక…దాన్ని పదే పదే అమలు చేయొచ్చు. అయితే గత ఎన్నికల ముందు ఏపీలో జగన్ ఏదైతే ఫార్ములాతో విజయం సాధించారో…ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఫార్ములాతో ముందుకెళ్లి సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. జగన్ సక్సెస్ అయిన ఫార్ములా వచ్చి అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించి పాదయాత్ర ద్వారా ఎప్పుడు జనంలో ఉంటూ…

వారి మద్ధతుని కూడబెట్టుకుని 2019 ఎన్నికల్లో గెలవడం. గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయనకు మాట్లాడటానికి పెద్దగా మైక్ ఇచ్చేవారు కాదు…ప్రతిదానికి మైక్ కట్ చేస్తూ ఉండేవారు..అలాగే అసెంబ్లీలో ఆయనని పలు రకాలుగా అవమానించారు..దీంతో జగన్ మధ్యలోనే అసెంబ్లీ సమావేశాలని పూర్తిగా బహిష్కరించి..పాదయాత్ర చేపట్టి…జనం మద్ధతు దక్కించుకుని, ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యి, అప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టారు.

సేమ్ ఇదే ఫార్ములా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఫాలో అవుతున్నారు…ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీలో చంద్రబాబుకు ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు..అలాగే ఆయన మాట్లాడటానికి మైక్ దొరకడం కష్టమే…ఇక చివరిగా అసెంబ్లీలో బాబు భార్య భువనేశ్వరి గురించి కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు అసభ్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే..ఇక అప్పుడు బాబు కన్నీరు పెట్టుకుని, ఇది ఒక కౌరవ సభని, తన భార్యని అవమానించిన సభలో ఉండలేనని, మళ్ళీ తాను సీఎం అయ్యాకే అసెంబ్లీలో పెడతానని శపథం చేసి అసెంబ్లీ నుంచి బయటకొచ్చేశారు.

ఇక ఇప్పుడు బాబు బాటలోనే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పయనిస్తున్నారు..అంటే టోటల్‌గా టీడీపీ అసెంబ్లీ సమావేశాలని బహిష్కరించింది. మరి ఇలా అసెంబ్లీని బహిష్కరించిన చంద్రబాబు..ఇకపై ప్రజల్లోకి వెళ్ళి, వారి మద్ధతుని మరింత పెంచుకుని, నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తారేమో చూడాలి. కాకపోతే జగన్ మాదిరిగా పాదయాత్ర చేస్తారా? లేక వేరే ఏమైనా యాత్ర చేస్తారా? లేదా నారా లోకేష్ చేత పాదయాత్ర చేయిస్తారా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news