అందాల లావ‌ణ్యం.. బ్యూటిఫుల్ లుక్స్‌..

-

లావణ్య త్రిపాఠి.. అచ్చం తెలుగ‌మ్మాయిలా ఉండే ఈ అందాల భామ అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగుప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. త‌న క్యూట్ డైలాగుల‌తో మంచి పేరు సంపాదించుకుంది. నాని మారుతి కాంబినేషన్‌లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా మూవీలో న‌టించి మెప్పించింది. సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ‌.. త‌న హాట్ హాట్ ఫొటోలు పోస్టు చేస్తూ కుర్రకారును ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.

తెలుగులోనే కాకుండా త‌మిళ‌, మ‌ళ‌యాల సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా మారింది. త‌న‌కు హైద‌రాబాద్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని, తాను ఎక్కువ‌గా ఇక్క‌డే ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్తుంది. అంతే కాదండోయ్ హైద‌రాబాద్ లో ఉండేందుకు సొంత ఫ్లాట్ ను కూడా కొనేసింది ఈ సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి. అప్ప‌ట్లో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకుంటే తెలుగు అబ్బాయినే చేసుకుంటాన‌ని చెప్తే తెలుగు కుర్రాళ్లు తెగ సంబుర‌ప‌డిపోయారు.

ఈ మ‌ధ్య తెలుగులో సినిమాలు త‌గ్గించిన లావ‌ణ్య‌.. ఇత‌ర భాష‌ల్లో మాత్రం బాగానే చేస్తోంది. అప్పుడ‌ప్పుడూ తెలుగు ప్రోగ్రామ్ ల‌లో మెరుస్తూ స‌ర్‌ప్రైజ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మ‌ధ్య లావ‌ణ్య త‌న 30వ పుట్టిన రోజును సెల‌బ్రేట్ చేసుకుంది. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో త‌న లేటెస్టు ఫొటోల‌న పోస్టు చేస్తూ తెలుగు కుర్రాళ్ల‌ను నిద్ర‌పోనీయ‌కుండా చేస్తోంది ఈ లావ‌ణ్యం. ఈ ముద్దుగుమ్మ లేటెస్టుగా ఇన్‌స్టా గ్రామ్ లో పోస్టుచేసిన ఫొటోలు బ్యూటిఫుల్ గాఉన్నాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. మ‌రి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news