లాయ‌ర్లు స‌సేమిరా.. టిక్‌టాక్ ప‌ని అయిపోయిన‌ట్లే..!

-

దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత నేపథ్యంలో చైనాకు సంబంధించిన 59 యాప్‌ లను భారత్‌ సోమవారం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమైన చైనీస్ సంస్థ టిక్ టాక్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ తరఫున వాదించాలంటూ మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్ రోహత్గిని టిక్ టాక్ కోరగా..దాన్ని ఆయన తిరస్కరించారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా యాప్‌ తరుఫున కోర్టుకు వెళ్లబోనని స్పష్టం చేశారు. దీంతో ఈ సంస్థ మరో న్యాయవాదిని వెతుక్కునే పనిలో పడింది.

ఒకసారి గతాన్ని పరిశీలిస్తే.. గతంలోనూ భారత ప్రభుత్వం ఓ సారి టిక్‌ టాక్‌ ను నిషేధించగా ఆ సంస్థ కోర్టుకెళ్లింది. తిరిగి భారత్‌ లో పలు నిబంధనలతో ఆ యాప్‌కు అనుమతులు ఇచ్చారు. కానీ, ఈ సారి న్యాయవాదులు ఎవరూ ఆ యాప్‌ తరఫున వాదించడానికి కూడా ముందుకు రావట్లేదు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేఖంగా వెళ్లొద్దని నిర్ణయించుకున్నారు. దీంతో టిక్‌ టాక్‌ కథ భారత్ లో ముగిసినట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news