BREAKING : రేపు బేగంపేట ఎయిర్ పోర్టులో మోడీ కీలక ప్రసంగం ఉండనుంది. రేపు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. బేగం పెట్ air port లో కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ. ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లను పరిశీలించారు లక్ష్మణ్, బీజేపీ నేతలు.
అనంతరం బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. Airport లో కార్యకర్తలతో మాత్రమే మీటింగ్ ఉంటుందని.. పక్క రాష్ట్రం సీఎం జగన్ ను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని చురకలు అంటించారు. ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండి అభివృద్ధి చేయమని మోడీని అడగాల్సింది పోయి రాకుండా ఉండటం సరికాదని కేసీఆర్ పై మండిపడ్డారు.
రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర బిజెపి తరఫున కోరుతున్నామని… సమాఖ్య స్పూర్తి ని మోడీ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి యేతర పాలన లో ఉన్న రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. 25 వేల కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ పర్యటన కొనసాగుతుంది.. తమిళ్ నాడు, ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీని పార్టీలకతీతంగా ఆహ్వానిస్తుంటే.. తెలంగాణలో మాత్రం స్వాగతించడం లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి. ఇది సబబు కాదని మండిపడ్డారు.