ఉద్యోగులకు అమెజాన్ షాక్.. 18వేల మంది తొలగింపు..!

-

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసేందుకు రెడీ అవుతోంది. 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. కొన్నేళ్లుగా అధిక సంఖ్యలో నియామకాలు జరుపుతుండటంతోపాటు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ ప్రకటించారు.

‘నవంబర్‌లో ప్రకటించిన దానికంటే అధికంగా సుమారు 18 వేల మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నాం’ అని ఆండీ జాస్సీ ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబర్‌లో 10 వేల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఖ్య 10 నుంచి 20 వేల మధ్య ఉంటుందని కంపెనీ వర్గాలు గతంలోనే వెళ్లడించాయి.

 

ప్రస్తుతం అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తాజాగా తొలగించనున్న ఉద్యోగుల సంఖ్య మొత్తం ఉద్యోగుల సంఖ్యలో రెండు శాతం కంటే తక్కువ. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం కారణంగా తన ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగాలపై కోతలు విధించాలని నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news