సండే మోటివేషన్: బాధలని సైడుకి జరిపేయండి.. నవ్వుతూ బతికేయండి..!

-

అందరికీ సమస్యలు ఉంటూ ఉంటాయి. అయితే సమస్యల్ని పదే పదే తలుచుకుని వాటి కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉండి జీవితాన్ని వృధా చేసుకోవడం మంచిది కాదు. జీవితమంటే కష్టసుఖాల సమరం కానీ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం బాధపడడం చేస్తూ ఆనందాన్ని మర్చిపోకూడదు. రెండూ సాధారణంగా వస్తూ ఉంటాయని.. కష్టాలు వచ్చినప్పుడు వాటిని గట్టెక్కడానికి చూసుకోండి.

- Advertisement -

అదే కష్టాలు లేనప్పుడు ఆనందంగా ఉంటే మంచిది. మీకు ఉండే కాస్త సమయం లో ఆనందంగా గడపడానికి చూసుకోండి కష్టాల గురించి చెప్పాలంటే ఒక పుస్తకం రాయొచ్చు. కన్నీళ్లు గొడవలు ఇవన్నీ కూడా కామన్ గా ఉంటూ ఉంటాయి. ఎప్పుడు చూసినా వాటి కోసమే తలుచుకుని బాధ పడడం వలన ఫలితం ఏమీ లేదు. మీకు ఉండే కొంత సమయం లో ఆనందంగా ఉండడానికి చూసుకోండి.

కష్టాలన్నీ ఒక పక్కన పెట్టుకుని ఉన్న సమయంలో ఆనందంగా జీవిస్తూ ఆరోగ్యంగా ఉండొచ్చు. మానసికంగా కూడా బాగుంటుంది. అంతేకానీ పదేపదే కష్టాలనే తలుచుకుంటూ ఆనందించాల్సిన సమయంలో కూడా బాధ పడడం మంచి అలవాటు కాదు. నవ్వుతూ ఆనందంగా ఉంటే బాగుంటుంది. అందరికీ కష్టాలు వస్తూ ఉంటాయి నాకు కూడా అలానే కష్టం ఈరోజు వచ్చింది అని అనుకోండి అంతే కానీ ఎప్పుడూ నాకే కష్టాలు ఉంటాయి ఎప్పుడు నాకే కష్టాలుంటాయి అని బాధపడి పోవద్దు.

వీలైనంత వరకు మీరు ఎందులో ఆనందంగా ఉంటారో దాని కోసం చూసుకోండి. ఆనందాన్ని వెతుక్కుని నవ్వుతూ ఉంటే కష్టాలు కూడా ఉండవు. పైగా కాసేపు నవ్వడం వల్ల మనకిపోయేదేముంది. కాబట్టి సరదాగా ఉండండి. నవ్వుకోండి. ఆనందంగా జీవించండి. మీ పనుల్లో కూరుకుపోయి నవ్వడమే మరచిపోయారు చాలా మంది. అలాంటివాళ్ళు ఈరోజు నుండి నవ్వడం మొదలు పెట్టండి. ఆనందంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...