లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం అంటే.. ఎవ్వరూ వదులుకోరు.. లైఫ్ సెట్ అంతే.. మన జాబ్ మనం చేసుకుంటే.. నెలతిరిగే సరికి అకౌంట్‌లో పైసలు పడిపోతాయి.. టెన్షన్ లేని జిబినెస్.. కానీ చాలామంది..దీన్ని ఒప్పుకోవడం లేదు. వ్యాపారం చేయడానికే ఇష్టపడతున్నారు. MNCలో జాబ్ వదిలేసి మరీ.. సొంత ఊరికి వచ్చి లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇతని సక్సస్ స్టోరీ వైపు ఓ లుక్కేద్దామా..! రాజస్థాన్‌లోని కోటాలో ఓ యువకుడు వేడి ప్రాంతంలో స్ట్రాబెర్రీలను పండిస్తున్నాడు. సాగు చేయడమే కాకుండా దాని ద్వారా చాలా ఆదాయం కూడా పొందుతున్నాడు. స్ట్రాబెర్రీలకు వాతావరణం కొంత చల్లగా ఉండాలి. అలాంటిది..అతను ఇంత వేడి ప్రాంతంలో కూడా ఇంత బాగా వ్యాపారం చేయడమే ఇక్కడ హైలెట్..
ఈ దంపతులు తమ ఉద్యోగాలను వదులుకుని వ్యవసాయంలో ఏదో ఒక విభిన్నమైన ప్రయత్నం చేయాలనుకున్నారు. స్ట్రాబెర్రీ సాగులో తక్కువ సమయంలో మంచి లాభాలు వస్తున్నాయని కపిల్ జైన్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ నుంచి స్ట్రాబెర్రీ మొక్కలను తీసుకొచ్చారు. మొదటి సంవత్సరంలో స్ట్రాబెర్రీలో ₹3 లక్షల లాభం వచ్చింది. కపిల్ ఒక బిగా భూమిలో 12,000 స్ట్రాబెర్రీ మొక్కలను నాటాడు. వాటిని బాగా చూసుకున్నాడు. స్ట్రాబెర్రీ సాగులో ఎదురయ్యే సమస్యల గురించి ప్రత్యేక అవగాహన లేకపోవడంతో ప్రారంభ సంవత్సరాల్లో పెద్దగా లాభం పొందలేకపోయాడు. అయినా సాగును వదల్లేదు. మరోసారి కొత్త ఉత్సాహంతో సిద్ధమై మంచి లాభాలను సాధించాడు. ఈరోజు కపిల్ దంపతులు ఆ ఊరి ప్రజలకు కూడా మంచి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాగుపై కోటాలో చర్చ జరుగుతోంది.
సంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలపై రైతులు దృష్టి సారిస్తే మంచి లాభాలు పొందవచ్చని కపిల్ చెబుతున్నారు. ఉద్యానవన పంటలకు మార్కెట్‌లో మంచి ధరలు లభించడం అతి పెద్ద సానుకూల అంశం. ఉద్యానవన పంటలకు మార్కెట్‌లో మంచి ధరలు లభించడం అతి పెద్ద సానుకూల అంశం. మామిడి, దానిమ్మ, అరటి, పియర్‌తో పాటు స్ట్రాబెర్రీ సాగు రైతులకు లాభసాటిగా మారుతోంది. పంటల సాగుకు ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. ఈ సాగు చేయాలి అనుకునేవారు ముందుగా సరైన సమాచారాన్ని సేకరించగలగాలి. మార్కెట్‌లో ఈ పండు ధర బాగానే ఉంది. సరైన పద్ధతిలో సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు.