లెట్స్ ట్రోల్ : డేంజరస్ గాళ్స్ తో ఆర్జీవీ ! ప్లే బోయ్ రోల్ అదిరిందయ్యో!

-

ఆర్జీవీ ఏం చేసినా సంచ‌ల‌న‌మే అని అనుకుంటే పొర‌పాటు కొన్ని గ‌తి త‌ప్పిన‌వి కొన్ని మ‌తి త‌ప్పిన‌వి కూడా ఉన్నాయి. క‌నుక ఆయ‌న చేసే ప్ర‌తి ప‌నీ ప్ర‌త్యేకం కావాల‌ని లేదు కానీ ఆ విధంగా ఉంటే బాగుంటుంది అని మాత్రం ఆర్జీవీ అనుకుంటారు.ఇదే మాట ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఆయ‌న చెబుతారు. నేను అనుకున్న‌ది అనుకున్న విధంగా తీశానా లేదా అన్న‌దే కానీ సినిమా హిట్టూ ఫ‌ట్టూ అన్న‌వి నా చేతిలో లేవు. నా చేతిలో లేని వాటి గురించి నేను అస్స‌లు ఆలోచించ‌ను.

ముఖ్యంగా నా ప‌నిలో ఇత‌రుల జోక్యం పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ను. ఇప్పుడు తీస్తున్న క‌థ ఈ క్ష‌ణం వ‌ర‌కే ఎక్సైట్ చేస్తుంది. మ‌ళ్లీ రేపు ఇదే థాట్ కానీ కాన్సెప్ట్ కానీ బోర్ కొడుతుంది. అందుకే ఓ సినిమాను వీలున్న‌త త్వ‌ర‌గా ముగించేస్తాను అని కూడా అంటారాయ‌న. కొత్త‌గా చెప్పేందుకు నేను ప్రయ‌త్నించ‌ను అని ఎలా అనుకుంటారు.? ఏ సినిమాకు సంబంధించి అయినా నేను ఒకే విధంగా కష్ట‌ప‌డ‌తాను..ఇప్పుడు లెస్బియ‌న్ క‌ల్చ‌ర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీశాను క‌నుక ఈ సినిమాకు ఏం కావాలో స‌మ‌కూర్చి, ఎంత కావాలో ఆ మేర‌కు ప‌నిచేసి, ఆర్టిస్టుల నుంచి నేను కోరుకున్న విధంగా రిజ‌ల్ట్ తీసుకుంటాను అని చెబుతున్నారాయ‌న.

ఈ ద‌శ‌లో అంద‌మయిన అమ్మాయిలు డేంజ‌రస్ అని అంటున్నారు ఆర్జీవీ. ఆ విధంగా త‌న మాట ఒక‌టి వినిపిస్తున్నారు ఆర్జీవీ. ఇదే సంద‌ర్భంలో తాను రూపొందించిన లెస్బియ‌న్ క‌ల్చ‌ర్ ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన డేంజ‌ర‌స్ ట్రైల‌ర్ ను విడుద‌ల చేసి నిన్న‌టి వేళ దేశ రాజ‌ధాని ఢిల్లీలో సంద‌డి చేశారు. త‌న ఇద్ద‌రు భామలు నైనా గంగూలి, అప్స‌ర రాణిల‌తో కూడుకుని అక్క‌డ హ‌ల్చ‌ల్ చేశారు.ఇదే సంద‌ర్భంలో ఆస‌క్తిదాయ‌క వ్యాఖ్య‌లు చేస్తూ సినిమా ప్ర‌మోష‌న్ హైట్స్ ను పెంచేశారు.

ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ మానియా ఉన్న నేప‌థ్యంలో త‌న సినిమాకూ,ఆ సినిమాకూ ఓ పోలిక తీసుకుని వ‌స్తూ ద‌ర్శ‌క ధీర రాజ‌మౌళికి ట్వీట్ చేశారు. ఇప్పుడిదే ట్రోల్ అవుతోంది. రాజ‌మౌళి స‌ర్ మీ ద‌గ్గ‌ర ఇద్ద‌రు డేంజ‌రస్ మెన్ ఉన్నారు కానీ నా ద‌గ్గ‌ర ఇద్ద‌రు డేంజ‌ర‌స్ విమెన్ ఉన్నారు అని పేర్కొంటూ సంచ‌ల‌న రీతికి కొన‌సాగింపు ఇచ్చారు. ఒక‌వైపు త‌న హీరోయిన్ల‌తో ఉంటూ దిగిన ఫొటోను, మ‌రో వైపు రాజమౌళి త‌న ఇద్ద‌రు హీరోల‌తో ఉన్న ఫొటోను క‌లిపి ట్వీట్ చేసి సినిమాపై మరింత ఆస‌క్తి పెంచారు. ద‌టీజ్ ఆర్జీవీ అని మ‌రోమారు అనిపించుకున్నారు. నిరూపించుకున్నారు కూడా!

Read more RELATED
Recommended to you

Latest news