తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి లేఖ రాశారు. వెలుగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవనడం సరికాదని.. కేంద్ర గెజిట్ లో ప్రాజెక్టును చేర్చకపోవడం ఏపీ ప్రభుత్వ వైఫల్యమని లేఖ లో పేర్కొన్నారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఆరు ప్రాజెక్టులకు అనుమతి అందులో కల్వకుర్తి, నెట్టెంపాడు సహా వెలుగొండ ఉన్నాయని… జగన్ రెడ్డి నిర్లక్ష్యం, చేతగానితనంతో కేంద్ర గెజిట్ లో చేర్చలేదని లేఖలో తెలిపారు. ప్రభుత్వ తప్పిదాలకు ప్రజల్ని, రైతాంగాన్ని బాధితుల్ని చేయడం సరికాదని… ప్రకాశం జిల్లా కరువు తీర్చే ఏకైక పరిష్కారం వెలిగొండ అని వివరించారు. సాగు, తాగునీటి కష్టాలు తీర్చగల ఏకైక భరోసా వెలిగొండ అని… ప్రభుత్వ చేతగాని తనాన్ని సాకుగా చూపి జిల్లా పై కక్ష సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. కరువు పిల్లాపై కక్ష వద్దని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పై కేంద్రానికి చేసిన ఫిర్యాదు పై పునః సమీక్షించు కోవాలని కోరారు ఎమ్మెల్యేలు.