ఎల్ఐసీ ధన్ రేఖ పాలసీ తో సూపర్ బెనిఫిట్స్…!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. ఈ పాలసీలతో సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. పెట్టుబడికి మంచి భరోసాతో పాటు బీమా కవరేజ్ కూడా అద్భుతంగా వస్తుంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎల్ఐసీ కూడా ఎప్పటికప్పుడు కొత్త తరహా పాలసీలను తీసుకు వస్తూనే ఉంటోంది. తాజాగా ఎల్ఐసీ ఒకేసారి పెట్టుబడి పెట్టే వారికి అనువుగా ఉండేలా పాలసీలని తీసుకు వస్తోంది మంచి రాబడిని అందించడమే కాక బీమా సదుపాయాన్ని కూడా ఇస్తోంది.

Life Insurance Corporation

ఈ పాలసీ పాలసీదారులు మరణించే వరకు క్రమం తప్పకుండా వారి లాభాల మొత్తాన్ని అందిస్తుంది. మహిళలతో పాటు థర్డ్ జెండర్‌గా గుర్తించే వారికి ప్రత్యేక డిస్కౌంట్ ప్రీమియంలని ఇస్తోంది. ఎల్ఐసీ ధన్ రేఖ అనే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు జీవిత బీమా ప్లాన్. పాలసీ రక్షణ, పొదుపు రెండింటినీ కూడా ఇస్తోంది. ఒకవేళ కనుక పాలసీదారుడు మరణిస్తే ఈ ప్లాన్ ద్వారా ఎల్ఐసీ పాలసీదారుని కుటుంబానికి ఆర్థిక సహాయం ఉంటుంది.

మరణ ప్రయోజనం, మనుగడ ప్రయోజనం, మెచ్యూరిటీ ప్రయోజనం, పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇందులో కనుక 30 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెడితే… పాలసీ ప్రీమియం కాలపరిమితి కూడా 30 సంవత్సరాలుగా ఉంటుంది. ఒక్కసారి ప్రీమియం రూ. 6,70,650 కడితే రూ. 10,00,000 బోనస్ వస్తుంది. ఒకవేళ మరణం సంభవిస్తే రూ.12,50,000 మరణ బీమా ఉంటుంది. ఇలా ఈ పాలసీతో రూ.23 లక్షలు అందుకోవచ్చు.