ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ ఐసీ వివిధ రకాల కొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఎల్ఐసీ కేవలం మగవారి కోసమే ఓ ప్రత్యేకమైన పాలసీని తీసుకువచ్చింది. దీన్నే ఎల్ ఐసీ ఆధార్ స్థంభ్ పాలసీ అని పిలుస్తున్నారు. ఈ పాలసీలో పాలసీదారుడు మెచ్యూరిటీ తీరక ముందు మరణిస్తే ‘సమ్ అష్యూర్డ్ అమౌంట్’ ని అందిస్తారు. ఒకవేళ మెచ్యూరిటీ తీరిన తర్వాత మరణిస్తే‘ సమ్ ఆఫ్ అష్యూర్డ్ అమౌంట్’ తో పాటు లాయల్టీ అదనపు డబ్బును కూడా ఇస్తుంది. ఇది మీరు చెల్లించిన ప్రీమియంకి ఏడు రెట్లు ఎక్కువడా ఉంటుంది. ఒకవేళ మెచ్యూరిటీ తీరే వరకూ మీరు ఈ పాలసీ మొత్తాన్ని మీరు చెల్లిస్తే మెచ్యూరిటీ తర్వాత మీరు చెల్లించిన మొత్తానికి కొన్ని రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి అందిస్తారు. దీన్నే సమ్ అష్యూర్డ్ మెచ్యూరిటీ అంటారు. దీన్ని ఒకేసారి, లేకపోతే నెలవారీ వాయిదాల రూపంలోనూ పొందవచ్చు. ఇలా దీనికోసం ఆధార్ కార్డ్ మాత్రమే ఉంటే సరిపోతుంది. దీని ద్వారా జీవిత బీమాతో పాటు సేవింగ్స్ కూడా పొందవచ్చు.
ఈ పాలసీ తీసుకోవడానికి 8 – 55 సంవత్సరాల మధ్యనున్న మగవారు మాత్రమే అర్హులు. పాలసీ టర్మ్ 10– 20 సంవత్సరాలు. మెచ్యూరిటీ తీరినప్పుడు మీ వయసు 70 కంటే ఎక్కువగా ఉండకూడదు. మొదట 75 వేల రూపాయలు కట్టి ఆ తర్వాత నెలకు ఐదు వేల రూపాయల చొప్పున కడుతూ పాలసీ పూర్తయ్యే వరకూ కట్టవచ్చు. నెలకు మూడు లక్షల వరకూ కట్టుకోవచ్చు. కరోనా నేపథ్యంలో పాలసీ క్లెయిమ్ విషయంలో పాలసీదారులు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకొని వారికి ఊరటనిచ్చింది. మెచ్యూరిటీ పూర్తయిన పాలసీలకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ డాక్యుమెంట్స్‌ను దేశంలోని ఏ సమీప ఎల్ఐసీ కార్యాలయంలోనైనా సమర్పించవచ్చని స్పష్టం చేసింది. అయితే.. ఈ అవకాశం మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది. కరోనా కారణంగా తమ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి, తమ సంస్థ కార్యాలయాల వద్ద రద్దీని నివారించడానికి, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్‌ను సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్ఐసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లో ఈ సర్వీసులు పొందవచ్చని తెలిపింది. అయితే, సమీప బ్రాంచులో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పటికీ, సర్వీసింగ్ బ్రాంచ్ మాత్రమే మీ క్లెయిమ్ సెటిల్మెంట్ను ప్రాసెస్ చేస్తుంది. దీని కోసం సంబంధిత అధికారులు మీ డాక్యుమెంట్స్‌ను డిజిటల్ ఫార్మాట్లో మీ సర్వీసింగ్ బ్రాంచ్‌కు పంపిస్తారు.అప్పుడు అమౌంట్‌ను సులభంగా పొందవచ్చు.