నల్గొండ కౌంటింగ్ కేంద్రం నుంచి కోదండరాం వెళ్లిపోయారు. తీవ్ర నిరాశకు లోనయిన ప్రొఫెసర్ కోదండరాం కౌంటింగ్ కేంద్రం నుండి నిష్క్రమించడం కనిపించింది. రెండవ ప్రాధాన్య ఓట్లతో సైతం కోదండరాం గట్టెక్కని పరిస్థితి నెలకొనడంతో ఆయన ముందే వెళ్ళిపోయారు. ఇక ఎలిమినేషన్ రౌండ్ లో కోదండరామ్ పేరు ఉన్నది. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ,తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది.
కోదండరామ్ సెకండ్ ప్రయారిటీ ,థర్డ్ ప్రిపరెన్షియల్ ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే విజేత అని అంటున్నారు. రెండో మూడో ప్రిపరెన్షియల్ లెక్కెసిన కోటా ఓట్లను సైతం అభ్యర్ధులు చేరుకోలేదు. కోదండరామ్ ఓట్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఉన్న ఓట్ల కంటే తీన్మార్ మల్లన్న కు ఎక్కువ వస్తే తీన్మార్ మల్లన్నకు అవకాశాలు ఉన్నట్టు, అయితే ప్రస్తుతానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి సేఫ్ జోన్ లో ఉన్నారని అంటున్నారు.