పెళ్ళికి ముందు మీరు అనుభవిస్తున్న జీవితం, పెళ్ళి తర్వాత అనుభవించకపోవచ్చు. పెళ్ళికి ముందు ఏది చేసినా మీరొక్కరే. కానీ పెళ్ళయ్యాక అలా కాదు. అప్పుడేదీ ఆలోచించినా ఇద్దరి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే పెళ్ళి తర్వాత చాలా మంది జీవితాల్లో మార్పులు వస్తాయి. ఐతే ఆ మార్పు అందరిలో ఒకేలా ఉండదు. కొందరు మంచి అలవాట్లని అలవర్చుకుని భాగస్వామితో హాయిగా గడపవచ్చు. మరికొందరిలో చెడు అలవాట్లు కలగవచ్చు.
పెళ్ళి తర్వాత వచ్చే మనుషుల్లో వచ్చే మార్పులేంటో చూద్దాం.
డబ్బులు మేనేజ్ చేయడం
పెళ్ళికి ముందులా ఏది పడితే అది కొనేయాలని చూడరు. డబ్బులు మేనేజ్ చేయడం పెళ్ళి తర్వాతే చాలా మంది నేర్చుకుంటారు.
సంబంధాలు
ఇతర వ్యక్తులతో సంబంధాలవైపు పెద్దగా చూడరు. చూడాలనుకున్న ప్రతీసారి మీ భాగస్వామి గుర్తు వస్తూ ఉంటుంది.
సమాజం
సమాజంలో జనాలందరూ మిమ్మల్ని మీ భాగస్వామిని కలిపి ఒకే జీవితంగా చుస్తారు. అందుకే పెళ్ళయ్యాక ఎక్కడికైనా పార్టీకి వెళ్ళాలనుకుంటే పెళ్ళైన వారితోనే వెళ్తారు.
సీరియస్ నెస్
పెళ్ళయ్యాక ఇతరులు మిమ్మల్ని చూసే విధానం మారిపోతుంది. అప్పటివరకూ ఎంత లైట్ తీసుకున్నా పెళ్ళయ్యాక చాలా సీరియస్ గా తీసుకుంటారు.
స్నేహం
పెళ్ళయిన జంటలు ఇతర పెళ్ళయిన జంటలతో స్నేహం చేయడానికే ఇష్టపడతారు.
ఒత్తిడి
మీ భాగాస్వామి అర్థం చేసుకునేవారైతే మీ ఒత్తిడి క్షణాల్లో దూరమవుతుంది.
సమయం
పెళ్ళయ్యాక సమయం చాలా తొందరగా గడిచిపోతుంది. చూస్తుండగానే పిల్లలు వచ్చేస్తారు. ఇంత తొందరగా జీవితం ముందుకెళ్తుందేంటి అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది.
దృష్టి
పెళ్ళయ్యాక సేవింగ్స్ మీదకి దృష్టి మళ్ళుతుంది. అప్పటివరకూ జాలీగా తిరిగినా సరే డబ్బులు సేవ్ చేయాలని ఆలోచిస్తారు.
పై మార్పుల్లో కొన్నైనా మీలో కలగకపోతే మీ జీవితంలో ఏదో లోపం ఉన్నట్టే లెక్క.