తాగినోడికి తాగినంత.. దాహం తీరుతోంది.. బిల్లు మోగుతోంది..!

-

క‌రోనా లాక్‌డౌన్‌.. అనుకోకుండా వ‌చ్చి ప‌డిన అతిథి.. అంద‌రి జీవితాల‌ను నాశనం చేసింది. ఎంతో మందికి ఉపాధిని దూరం చేసింది.. ఎంతో మందిని తీవ్ర‌మైన ఇబ్బందుల‌కు గురి చేసింది. అందులో మందు బాబులు కూడా ఉన్నారు. అస‌లు నిజంగా చెప్పాలంటే.. లాక్‌డౌన్‌లో అంద‌రిక‌న్నా ఎక్కువగా బాధ‌ప‌డింది.. మందు బాబులే అని కూడా స్ప‌ష్ట‌మ‌వుతుంది. నిత్యం మ‌ద్యానికి అల‌వాటు ప‌డ్డ నాలుక‌కు ఒక్క‌సారిగా మందు దొర‌క‌క‌పోయేస‌రికి మైండ్ అంతా క‌కావిక‌లం అయింది. చాలా చోట్ల మందు బాబులు పిచ్చిపట్టిన‌ట్లు ప్ర‌వ‌ర్తించారు. ఇక కొంద‌రైతే ఏకంగా.. వైన్స్‌లకు పర్మిషన్‌ ఇవ్వండి.. ఎన్నిరోజులైనా లాక్‌డౌన్‌ పెట్టుకోండంటూ.. వేడుకున్నారు. ఈ క్ర‌మంలోనే వారు ఆశించిన‌ట్లుగానే.. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్ అంటూ లాక్‌డౌన్‌ రూల్స్ ను‌ కొంచెం సడలించారు. దీంతో మ‌ళ్లీ మ‌ద్యం అమ్మ‌కాలు మొద‌ల‌య్యాయి. మందు బాబులు పండ‌గ చేసుకుంటున్నారు.

liquor lovers drowning in drinking spending too much for booze

దేశంలోని అనేక రాష్ట్రాల్లో సోమ‌వారం నుంచి మ‌ద్యం విక్ర‌యాలు మ‌ళ్లీ ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో ఇప్ప‌టికే మ‌ద్యం లేక నాలుక పిడ‌చ‌గ‌ట్టుకుపోయిన మందు బాబులు.. మ‌ద్యం షాపుల‌వైపు దౌడు తీశారు. హుటాహుటిన దుకాణాల‌కు వెళ్లి.. భారీ లైన్ల‌లో నిలుచున్నారు.. ఎట్ట‌కేల‌కు మ‌ద్యం కొనుగోలు చేశారు. త‌నివి తీరా దాని రుచిని మ‌ళ్లీ ఇన్ని రోజుల‌కు.. ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు. ఇక కొంద‌రైతే మంచి త‌రుణం మించిన దొర‌క‌దేమోన‌ని భావించి భారీ ఎత్తున మ‌ద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బెంగ‌ళూరులో ఓ మ‌ద్యం షాపులో ఓ వ్య‌క్తి ఏకంగా రూ.52,841 విలువైన మ‌ద్యాన్ని కొనుగోలు చేసి ఆ ర‌శీదును సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో.. ఇప్పుడ‌ది వైర‌ల్‌గా మారింది.

దాదాపుగా 40 రోజుల పాటు మ‌ద్యం దొరక్క‌పోయే సరికి మందు బాబుల‌కు నాలుక ఎండిపోయిన‌ట్ల‌యింది. ఇక ఇప్పుడు మ‌ళ్లీ మ‌ద్యం దొరుకుతుండ‌డంతో పెద్ద ఎత్తున మందు బాటిళ్ల‌ను కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకుంటున్నారు. మ‌ళ్లీ దుకాణాల‌ను మూసేస్తే ఎలా.. అని చెప్పి ముందుగానే ఆలోచించి కొంద‌రు త‌మ ఇండ్ల‌లో మ‌ద్యం బాటిళ్ల‌తో నింపేస్తున్నారు. ఇక కొంద‌రైతే ఆవురావురుమంటూ.. మ‌ద్యాన్ని మంచినీళ్ల‌లా తాగేస్తున్నారు. ఏది ఏమైనా.. మ‌ద్యం ప్రియులు మాత్రం ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news