ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి కాస్త సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్న పేదలకు ఆర్థిక స్వతంత్రం మాత్రం సీఎం జగన్ ఆ పదవిలోకి వచ్చిన తర్వాత జరిగింది అంటూ వ్యాఖ్యలు చేయడం కాస్త హాట్ టాపిక్ గా మారింది. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికి మూడు తేదీలు పెట్టడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ,సుప్రీం కోర్టు లో అప్పీలు చేయటం ఏమంటే మీరు పేదల భూములను కబ్జా చేశారని భూములను ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో ఇప్పుడు వారు బాధపడుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు.
చంద్రబాబు నాయుడు అనవసరంగా రకరకాలైన కుంటిసాకులతో పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కోర్టులు కూడా పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పై త్వరగా మంచి నిర్ణయాన్ని వెలువరించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. 27 గ్రామాల కోసమే చంద్రబాబు నాయుడు మూడు రాజధానులు వద్దు అని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన మండిపడ్డారు.