యువ క్రికెటర్ల అత్యుత్సాహం.. అంబులెన్స్ లో సంబరాలు

-

యువతలో ఉత్సాహం ఉప్పొంగినపుడు ఎలాంటి పనులు చేస్తారో వాళ్ళకే తెలియకుండా పోతుంది. కొన్ని కొన్ని సార్లు ఆ పనులు ఇతరులను ఇబ్బంది కలిగించేలా ఉంటున్నాయి. చాలా సార్లు నియమ నిబంధనలు అతిక్రమిస్తున్నాయి కూడా. ఇలాంటి విషయాల్లో చర్యలు తీసుకుంటున్నప్పటికీ అత్యుత్సాహం కారణంగా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. తమిళనాడులో జరిగిన సంఘటన అలాంటిదే. స్థానిక క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచినందుకు సంబరాలు జరిపిన క్రికెటర్లు, అక్కడ ఉన్న అంబులెన్సుల్లో చక్కర్లు కొట్టారు.

రెండు మూడు అంబులెన్సుల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉత్సాహంతో చిందులు తొక్కారు. రోగుల కోసం వినియోగించే అంబులెన్సుల్లో ఇలా సంబరాలు జరపడంపై అక్కడి పోలీసులు తప్పుబట్టారు. ఈ వీడియో సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఐదుగురు డ్రైవర్లు, నలుగురు యువకులను అరెస్టు చేసారు. తదనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news