ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసారు. కరోనా వైరస్ ప్రభావం నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఆరు వారాల తర్వాత సమీక్ష నిర్వహించి, అప్పుడు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసేది లేదని ఆయన స్పష్టం చేసారు. ఏకగ్రీవం అయిన వారు కొనసాగుతారని చెప్పారు.
హింసాత్మక చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. అత్యున్నత స్థాయి సమీక్ష తర్వాత నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేసారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. కొన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. పున్గునురు, మాచర్ల, తిరుపతి ఘటనలపై విచారణ చేస్తున్నామని అన్నారు.
నామినేషన్లు, ఎకగ్రీవాలు ప్రస్తుత పరిస్థితిని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. గొడవలు జరిగి ఏకగ్రీవం అయిన వాటిని సమీక్షిస్తామని అన్నారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్ లను విధుల నుంచి తొలగిస్తున్నామని అన్నారు. శ్రీకాళహస్తి, పలమనేరు, రాయదుర్గం, డిఎస్పీలను, సిఐలను బదిలీ చెయ్యాలని సూచించారు. గుంటూరు చిత్తూరు ఎస్పీలను బదిలీ చెయ్యాలని సూచించారు. ఇక మాచర్ల సిఐ పై సస్పెన్షన్ వేటు వేసారు.