ఒడిశా ప్రభుత్వం మే 5 నుండి మే 15 వరకు ఉదయం 7 నుంచి 12 మధ్య రాష్ట్రంలో 14 రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే, వారాంతాల్లో పూర్తి షట్డౌన్ ఉంటుంది అని ప్రకటించింది. స్థానికులు కూరగాయలు కొనడానికి ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య 500 మీటర్లకు మాత్రమే అనుమతి ఉందని అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెప్పింది.
శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు పూర్తి షట్ డౌన్ చేస్తారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు అన్నీ కూడా లాక్ డౌన్ ప్రకటించాలి అనే డిమాండ్ లు వినపడుతున్నాయి. కేంద్రం కూడా లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.