టీడీపీ DNAనే బీసీ..బీసీల గుండెల్లో ఉండేదే టీడీపీ అని పేర్కొన్నారు నారా లోకేష్. కాపీ క్యాట్ వచ్చి రాజకీయాలు చేస్తే.. ప్రజలు నమ్మరు… బీసీలకు జగన్ చేసింది సున్నా.. ఇచ్చిన హామీలు సున్నా.. మరి జయహో బీసీ ఎందుకో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు.
ప్యాలెస్ పిల్లి కాపీ క్యాట్.. బీసీ సదస్సుకు మేం పెట్టిన పేరే పెట్టారని వెల్లడించారు నారా లోకేష్. మేం అప్పట్లో జయహో బీసీ సదస్సు కోసం పాట తయారు చేశాం.. కావాలంటే ఆ పాట కూడా పంపుతాం.. వాడుకోండన్నారు.
జగన్ వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 8 శాతం కోత పెట్టారని అగ్రహించారు. దాదాపు 26 ఏళ్ల పాటు.. బీసీలు 34 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తే.. జగన్ వచ్చి దాన్ని 26 శాతానికి తగ్గించారు… బీసీ కార్పోరేషన్ ద్వారా టీడీపీ రూ. 6 వేల కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ ఖర్చు పెట్టింది సున్నా అని చురకలు అంటించారు.