జగన్ గజదొంగ: లోకేశ్

-

సీఎం జగన్ పంచాయతీల నిధుల దొంగ అని నారా లోకేశ్ విమర్శించారు. ‘గత ప్రభుత్వ హయాంలో నూరు శాతం సిమెంట్ రోడ్లు, మరుగుదొడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, LED వీధి దీపాలు, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, గ్యాస్ సిలిండర్లు అందజేసి నల్లజర్లను స్మార్ట్ విలేజీగా తీర్చిదిద్దాం. పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 14, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.9వేల కోట్లు దొంగిలించాడు గజదొంగ జగన్ రెడ్డి’ అని ట్వీట్ చేశారు.

అదే నాలో కసి రగిల్చింది: నారా లోకేశ్ ప్రత్యేక సందేశం

జగన్ రెడ్డి పాలనలో రోడ్లన్నీ దుర్భరంగా తయారయ్యాయన్నారు. గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టారన్నారు. దివాలాకోరు ముఖ్యమంత్రి ముఖం చూసి రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇదివరకెన్నడూ లేని విధంగా 25 వేల కి.మీ.ల సిమెంటు రోడ్లు వేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం రోడ్లపై తట్టిమట్టి పోసే దిక్కులేకుండా పోయిందన్నారు. రోడ్లకోసం అంతర్జాతీయ సంస్థల నుంచి తెచ్చిన నిధులను కూడా జగన్ దారి మళ్లించారని లోకేశ్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news