నేడు(ఆదివారం) వరల్డ్ ఫాదర్స్ డే! ప్రపంచ నాన్నల దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి కుమారుడు.. తనను కని పెంచి, చదివించి వృద్దిలోకి తెచ్చిన తన తండ్రి పట్ల కృతజ్ఞతను చూపించే రోజు(నిజానికి మన దే శంలో ఒక రోజంటూ ప్రత్యేకంగా లేదు. ప్రతి రోజూ.. పితృదేవో భవ.. అంటూనే నిద్ర లేస్తాం. కానీ, పాశ్చ్యాత్య సంస్కృతి వచ్చాక ప్రత్యేక రోజులను మన దేశంలోనూ పాటిస్తున్నాం. ఏదైనా మంచిదే కదా!). ఈ సందర్భం గా రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నేతల కుమారులు తమ తండ్రుల పట్ల ఎలాంటి కృతజ్ఞతా భావం ప్రదర్శించారో.. ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు పలువురు విశ్లేషకులు.
మరీ ముఖ్యంగా చంద్రబాబు ప్రోత్సాహంతో ఆయన కుమారుడు లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో అప్పటి వరకు లోకేష్ ఎవరో కూడా తెలియని వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పరిచయమయ్యారు. అంతేకాదు, మంత్రిగా కూడా చంద్రబాబు లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చారు. అంటే.. సాధారణంగా ఎవరైనా కూడా చదువు.. చెప్పించడం, ఆస్తులు ఇవ్వడం వరకే పరిమితమవుతారు. ఉపాధి, లేదా రాజకీయాలు అనేవి సహజంగా వారి ప్రతిభపైనే ఆధారపడి సంపాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం లోకేష్‌కు అన్నీ తానే అయి చంద్రబాబు చక్కదిద్దారు. ఎక్కడా కూడా లోకేష్ చెమటపిండి సాధించింది ఏమీ లేదు.
మరి.. లోకేష్.. తన తండ్రికి ఈ పితృదినోత్సవం సందర్భంగా ఇచ్చిన కానుక ఏంటి? అంటే.. గత ఏడాది తో పోల్చుకుంటే. కొంత మేరకు మెరుగైన పరిస్థితిలోనే లోకేష్ పొలిటికల్ ప్రయాణం సాగుతోందని అంటు న్నారు పరిశీలకులు. పార్టీని కాపాడుకోవడంలో ఆయన కీలకభూమిక పోషిస్తున్నారు. అదేసమయంలో అ సంతృప్తులను బుజ్జగించేందుకు తనవంతుప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పార్టీలో యువత ను కీలకంగా మార్చేందుకు వారితో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నారు.
సీనియర్లతోనూ టచ్‌లో ఉం టున్నారు. ఎక్కడ వాయిస్ వినిపించాలో అక్కడ వినిపిస్తూ.. పార్టీలో ఫర్వాలేదు.. పుంజుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపించేలా చేస్తున్నారు. కొన్ని మైనస్‌లు ఉన్నప్పటికీ.. కొంత మార్పు రావడం కనిపిస్తోంది. ఈ పరిణామమే చంద్రబాబుకు లోకేష్ ఇచ్చే పితృదినోత్సవ కానుకగా పేర్కొంటున్నారు పార్టీ నాయకులు.