షాకింగ్‌ : ఫిఫా ఫైన‌ల్‌ను తిలకించేందుకు ఫేక్‌ కిమ్‌..

-

క్రీడాలోకం యావత్తు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సాకర్‌ తుది సమరానికి వేళైంది. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఆదివారం డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌తో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోనుంది. ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి తర్వాత అనూహ్యంగా పుంజుకున్న అర్జెంటీనా.. వరుస విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టగా.. అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్న ఫ్రాన్స్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా తుదిపోరుకు చేరుకుంది. అయితే.. మ్యాచ్ కోసం వ‌చ్చిన అభిమానులకు ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ యున్‌ను పోలిన వ్య‌క్తి క‌నిపించాడు. లూసెయిల్ స్టేడియం ద‌గ్గ‌ర్లోని ఫ్యాన్ ఫెస్టివ‌ల్ ద‌గ్గ‌ర ఉన్న‌ అత‌డిని ఫొటోగ్రాఫ‌ర్స్ చుట్టుముట్టారు. ఆ వ్య‌క్తి పేరు హొవార్డ్ ఎక్స్‌. చైనా మూలాలు ఉన్న ఆస్ట్రేలియా పౌరుడు. ఖ‌త‌ర్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ త‌న‌కు ఆనందాన్ని పంచింద‌ని హొవార్డ్ తెలిపాడు. గ‌తంలో బ్రెజిల్, ర‌ష్యా ఆతిథ్యం ఇచ్చిన ఫిఫా వ‌రల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌కు తాను హాజ‌ర‌య్యాన‌ని చెప్పుకొచ్చాడు.

FIFA World Cup | వ‌ల‌ర్డ్ క‌ప్ స్టేడియం దగ్గ‌ర కిమ్ జాంగ్‌ను పోలిన వ్య‌క్తి.. ఫొటోలు వైర‌ల్

 

అంతేకాదు ఈ నెల ప్రారంభంలో ‘2030లో ఉత్త‌ర‌కొరియాలో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హ‌ణకు లాబీయింగ్ చేయడానికి వ‌చ్చాను’ అంటూ ఒక వీడియో విడుద‌ల చేశాడు. హొవార్డ్ వృత్తిరీత్యా సంగీత ద‌ర్శ‌కుడు. ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడిలాగా ఉండ‌డంతో అత‌డిని త‌ర‌చూ అనుక‌రిస్తూ ఉంటాడు. అలాగ‌ని కిమ్ జాంగ్ గురించి గొప్ప‌గా చెప్ప‌డం అత‌ని ఉద్దేశం కాదు. కిమ్‌ను విమ‌ర్శిస్తూ, వ్యంగ్యంగా జోకులు వేసేందుకే కిమ్‌ను ఇమిటేట్ చేస్తాన‌ని హొవార్డ్ వెల్ల‌డించాడు. ఇత‌ను 2018లో పెయింగ్ చాంగ్‌లో జ‌రిగిన వింట‌ర్ ఒలింపిక్స్‌లో ఉత్త‌ర కొరియా చీర్ లీడ‌ర్స్‌ను క‌లిశాడు. దాంతో ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించాడు.

Read more RELATED
Recommended to you

Latest news