ఇలా చేస్తే మీరు పదేళ్లు తక్కువగా కనపడచ్చు..!

చాలామంది అందం పై శ్రద్ధ ఎక్కువగా పెడుతూ ఉంటారు. అందంగా కనపడాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా అందంపై శ్రద్ద ఎక్కువ పెడతారా..? ఈ హోమ్ టిప్స్ ని ఫాలో అయితే మీ వయస్సు కంటే పదేళ్ల కంటే తక్కువగా కనపడవచ్చు. మరి వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

నిమ్మరసం:

ముఖంపై నిమ్మరసం రాసుకుని ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగి వేసుకుంటే సరిపోతుంది. నిమ్మలో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి ఇవి ముసలితనం రానివ్వకుండా చూసుకుంటాయి.

అలోవెరా:

అలోవెరా గురించి స్పెషల్ గా చెప్పక్కరలేదు అలోవెరా లో చక్కటి గుణాలు ఉంటాయి. రాత్రిపూట ఆలోవెరా గుజ్జును ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకుంటే మీ అందాన్ని మరింత పెంచుకోవచ్చు.

బొప్పాయి:

బొప్పాయిలో చక్కటి పోషక పదార్థాలు ఉంటాయి చర్మానికి కూడా బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి పేస్ట్ ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు వదిలేసి కడిగేసుకుంటే మీ వయసు కంటే 10 ఏళ్ళ వయసు తక్కువగా కనబడుతుంది.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్ కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది త్వరగా ముడతలు రాకుండా చూసుకుంటుంది.

కాఫీ:

కాఫీ ని కూడా మీరు పేస్టులాగా చేసి ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు దీంతో బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది. మొటిమలు గీతలు వంటి సమస్యలు ఉండవు.

కొబ్బరి నూనె:

ఇది కూడా చక్కగా పనిచేస్తుంది. అలానే గ్రీన్ టీ కూడా మీరు మీ అందాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇలా అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.