ఎవరైన కరోనా కారణంగా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు రూ.2 లక్షలు పొందే అవకాశం ఒకటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ ఒకటి అందుబాటులో వుంది. దీని వలన కరోనా తో ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకి రూ.2 లక్షలు క్లెయిమ్ పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే..
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY అనే ఇన్సూరెన్స్ స్కీమ్ వుంది. ఈ స్కీమ్ ద్వారా డబ్బులు పొందొచ్చు. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అయితేనే ఈ లాభం ఉంటుంది. లేక పోతే డబ్బులు రావు. ఈ స్కీమ్‌లో చేరిన వారు ఏడాదికి రూ.330 కడుతూ రావాలి.
బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు కచ్చితంగా ఈ స్కీమ్‌లో చేరి ఉంటారు. కోవిడ్ 19 వల్ల మరణించినా కూడా రూ. 2 లక్షలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఏ కారణంతోనైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.2 లక్షలు లభిస్తాయి. ఒకవేళ ఎవరైనా హత్య, సూసైడ్ వల్ల చనిపోయినా కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి.
ఎవరైనా కరోనా తో మరణిస్తే ముందుగా వారి డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలి. బ్యాంక్‌కు వెళ్లి ఈ డెత్ సర్టిఫికెట్ సహా ఇతర డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే చాలు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసు ఉన్న వారు మాత్రమే ఈ స్కీమ్ కి అర్హులు.