సూపర్ స్కీమ్స్.. అధిక రాబడితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా.. పూర్తి వివరాలు ఇవే..!

-

భవిష్యత్తులో ఎదురయ్యే అవసరాలని చూసుకుని చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది సురక్షితమైన పథకంలో డబ్బులు పెడుతున్నారు. పైగా ఇలా ఇన్వెస్ట్ చేయడం వలన భవిష్యత్తు లో ఇబ్బందులు ఏమి రావు సరి కదా మనం ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు మొదలు కేంద్ర ప్రభుత్వం అందించే స్కీములు దాకా మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్లు మనకి ఉన్నాయి. అయితే ఈ క్రమంలో అందరికీ నచ్చే బెస్ట్ స్కీమ్ ఫిక్స్ డిపాజిట్.

అధిక వడ్డీ తో పాటుగా సెక్షన్ 80 సీ కింద పన్ను బెనిఫిట్స్ కూడా దీని వల్ల ఉంటాయి అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ తో కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలని మనం పొందవచ్చు. పన్ను ప్రయోజనాలని అందించే ఏకైక స్కీం ఈ ఎల్ ఎస్ ఎస్ స్కీం. దీని ద్వారా సెక్షన్ 80c కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ రెండిట్లోనూ ప్రయోజనాలతో పాటుగా కొన్ని నష్టాలు కూడా ఉంటాయి వాటి గురించి ఇప్పుడు మనం చూసేద్దాం.

ఈక్విటీ లింకెడ్ సేవింగ్స్ స్కీమ్ లేదా ఈ ఎల్ ఎస్ ఎస్ అనేది తగ్గింపులకి అర్హత ఉన్నా మ్యూచువల్ ఫండ్ స్కీం. ఈ స్కీం లో మాత్రమే టాక్స్ బెనిఫిట్స్ ని పొందవచ్చు సంవత్సరానికి లక్షన్నర వరకు పన్ను ప్రయోజనాలని ఇది అందిస్తుంది. 10 శాతం పన్ను విధించిన తర్వాత కూడా రాబడి పరంగా ప్రయోజనాలు దీనితో పొందొచ్చు. ఐదేళ్లపాటు పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది.

పైగా ఈ స్కీం లో లాకింగ్ పీరియడ్ కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే. అదే ఫిక్స్డ్ డిపాజిట్లు గురించి చూసినట్లయితే ప్రతి ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర వరకు పన్ను మినహాయింపుని పొందవచ్చు. దీని లాగిన్ పీరియడ్ వచ్చేసి ఐదేళ్లు. ఈ డిపాజిట్ ని మీరు ముందుగా వీటిలో చేయడానికి అవ్వదు. మీ ఫిక్సెడ్ డిపాజిట్స్ పై రుణం తీసుకోవచ్చు డిపాజిట్లు పై వసూలు చేసే వడ్డీ స్లాబ్ ప్రకారం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news