ప్రేమ పవిత్రమైనదే..! మనుషులెందుకు మారిపోతున్నారు..?

-

ప్రేమికుల రోజును ఎంతోమంది సెలబ్రెట్‌ చేసుకుంటారు.. కానీ పోయిన సంవత్సరం ఉన్న ప్రేమ ఈరోజు కూడా మీతోనే ఉందా.. అంటే చాలామంది లేదనే సమాధానం ఇస్తారు.. ప్రేమ వచ్చినట్లే వచ్చి పోతుంది. మనసుకు దగ్గరవుతారు.. వాళ్లే ప్రపంచం అయిపోతారు.. అంతా నువ్వే అనుకునేలోపే.. మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ప్రేమ పవిత్రమైనదే.. కానీ మనుషులే చంచలైన మనస్తత్వంతో ఆగం ఆగం అయిపోతున్నారు. ఈరోజుల్లో ప్రేమ అంటే..అవసరాలకు పెట్టుబడి అయిపోతుంది. స్వచ్ఛమైన ప్రేమను పొందగలడం అంటే ఎంతో అదృష్టం చేసుకోని ఉండాలి..
ప్రేమించడం అంటే.. రోజు ఐలవ్యూ చెప్పడం, ఇంకా ఇంకా అంటూ వాట్సప్‌లో మెసేజ్‌ చేయడం, బర్తడేలకు, వాలంటైన్స్‌డేలకు గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం ఇంతేనా.. ఈ తరం వాళ్లకు తెలిసింది. ప్రేమిస్తే మాటల్లో చెప్తేనే తెలుసుకోగలుగుతున్నామంటే.. అదెలా నిజమైన ప్రేమ అవుతుంది. మీరు చెప్పకుండా ఆ వ్యక్తి మీరు ఎంత ప్రేమిస్తున్నారో తెలుకోగలగాలి..ప్రేమించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు.. అలాగే విడిపోవడానికి కూడా ఎన్నో కారణాలు ఉండొచ్చు..కానీ తప్పు ప్రేమదని నిందించడమే సమస్య..
ప్రేమించిన వ్యక్తి జీవితాంతం మీతోనే ఉండాలి అనుకోవడం ఎంత మాత్రం కరెక్ట్‌ కాదు.. రాతలో లేని రాధను కృష్టుడు ప్రేమించి చరిత్రకు ఎక్కాడు.. అలాంటిది మీ రాతలో లేని వాళ్లను ప్రేమించి వాళ్లు జీవితాంతం మీతోనే ఉండాలి అనుకోవడం ఎంతవరకూ సమంజసం.. కృష్టుడికే సాధ్యం కాలేదు.. మానవమాత్రులం మనకెలా సాధ్యం అవుతుంది చెప్పండి.. నిజమైన ప్రేమ దొరికినప్పుడు అది ఒదులుకోవడం కష్టమే.. కానీ పరిస్థితులు అనుకూలించనప్పుడు వదిలేయండి. ప్రేమ అంటే పట్టుకోవడమే కాదు.. వదిలేయడం కూడా.. ప్రేమకు అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేదు.. నిజంగా ప్రేమిస్తే..ఇద్దరు జీవితాంతం ఆ ప్రేమను మర్చిపోలేరు.. మిమ్మల్ని వదిలేసి వేరేపెళ్లి చేసుకుని సుఖంగా ఉందని మీరు అనుకుంటారు.. కానీ ఆమె గుండెలోతుల్లో బాధ ఎప్పటికీ అలానే ఉంటుంది. ఏం చేస్తాం.. పరిస్థితులకు తలఒగ్గి నిర్ణయం మార్చకున్నారు అంతే. అబ్బాయిలు కూడా వాళ్లు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేరు. ఎన్ని ఏళ్లు అయినా మనసులో వారి తాలూకూ జ్ఞాపకాల గూడు అలానే ఉంటుంది. జీవితం అన్నీ కావాలనుకుంటే నడవదు..
స్వచ్ఛమైన ప్రేమ దొరికితే దాన్ని వందశాంతం నిలబెట్టుకోవడానికే ప్రయత్నించాలి…పరిస్థితులు అనుకూలించక విడిపోయేవాళ్లు కొందరైతే.. చిన్న చిన్న కారణాలకే మిమ్మల్ని ఇష్టపడే వాళ్లను దూరం చేసుకునేవారు చాలామంది ఉన్నారు…అలా చేస్తే చివరికి మీరే పశ్చాతాప పడక తప్పదు.. అర్థంచేసుకోవడమే నిజమైన ప్రేమకు పునాది. నమ్మకం అనే గోడలతో కట్టుకున్న ప్రేమ ఎప్పటికీ కూలిపోదు ! ప్రేమ మిమ్మల్ని అడిగి రాలేదు కదా.. చెప్పి వెళ్లడానికి..ఎంత డబ్బు సంపాదించినా ఒక మనిషి ఆలోచనల్లో చోటును కొనలేం.. అలాంటిది ఓ వ్యక్తి నీ గురించి నిరంతరం పరితపించిపోతున్నారంటే.. నువ్వెంత గొప్పవాడివి..దానికి కారణం అయిన ప్రేమ ఇంకెంత గొప్పది..ప్రేమ గురించి, అమ్మ గురించి ఎంత మాట్లాడినా తక్కువే.. అనుభవించిన వారికే ఆ విలువ తెలుస్తుంది..! so… Happy Valentine’s Day..!

Read more RELATED
Recommended to you

Latest news