చిన్న చిన్న నాయకులు కూడా నన్ను తిట్టారు – కోమటిరెడ్డి

-

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన పొత్తు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం గరం గరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి కచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చర్యలు తీసుకోవాలని, లేదంటే పార్టీ బలోపేతానికి, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు, ఇతర నాయకులు చేస్తున్న కార్యక్రమాలకు అర్థం లేకుండా పోతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు పార్టీలోని చోటామోటా నేతలు సైతం కోమటిరెడ్డి పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం తనని కలవాలని కోమటిరెడ్డి కి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు నుంచి పిలుపు వచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఈలోపే వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈరోజు సాయంత్రమే ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతూ..

” రాహుల్ గాంధీ వరంగల్ లో చెప్పిన వ్యాఖ్యలనే నేను గుర్తు చేశాను. బిజెపితో పాటు కాంగ్రెస్ నేతలు నా వ్యాఖ్యలపై రాజకీయం చేస్తున్నారు. హంగ్ అసెంబ్లీపై సోషల్ మీడియాలో వచ్చిన అంశాలనే నేను ప్రస్తావించాను. నేను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరిస్తుంది. ఇవాళ చిన్న చిన్న నాయకులు కూడా నన్ను తిట్టారు. నా వ్యాఖ్యలు అర్థం అయ్యే వాళ్లకు అర్థం అవుతాయి” అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news