ఈ ఒక్క పదం మన జీవితంలో ఎన్నో అవకాశాలను, ఆనందాలను దూరం చేస్తుంది అదే భయం. మనం ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్న, మనసులోని మాట చెప్పాలన్న భయంతో వెనకడుగు వేస్తుంటాం కానీ భయాన్ని జయించగలిగితే జీవితం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? అందుకు ఒక సులభమైన శక్తివంతమైన మార్గం ఉంది అదే నవ్వు. అవును నవ్వు ద్వారా మనం భయాన్ని అధిగమించవచ్చు జీవితాన్ని నిండుగా ప్రేమించవచ్చు. నవ్వు అనేది మనలో ధైర్యాన్ని పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి మనకు శక్తిని ఇస్తుంది. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడో మహాకవి. మరి నవ్వు మన భయాన్ని ఎలా పొగుడుతుందో జీవితాన్ని ప్రేమించడం ఎలాగో తెలుసుకుందాం..
నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది : మనం భయపడినప్పుడు మన శరీరంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ విడుదలవుతాయి. నవ్వినప్పుడు ఈ హార్మోన్లు స్థాయి తగ్గి ఎండార్పిన్ అనే సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. రోజులో కాసేపైనా మనస్ఫూర్తిగా నవ్వగలిగితే ఎన్నో భయాలను దూరం చేయవచ్చు.

మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది : నవ్వు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఒక సమస్యను చూసి భయపడటం మానేసి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఇది మనకు జీవితంలో వచ్చే సవాళ్లు సులభంగా ఎదుర్కొనే శక్తినిస్తుంది.
నెగిటివ్ ఆలోచన దూరం: మనం ఏదైనా ఒక భయంకరమైన సంఘటన చూసినప్పుడు, ఆ సంఘటన జరిగిన తరువాత మనం ఎక్కువగా భయపడుతూ అదే తలుచుకుంటూ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము. భయం తరచుగా నెగటివ్ ఆలోచనల నుంచి పుడుతుంది. నవ్వు అనేది నెగిటివ్ ఆలోచనల నుండి మన దృష్టిని మళ్లించి మనసులో పాజిటివ్ నింపుతుంది. చిన్న చిన్న విషయాలకు నవ్వుకోవడం అలవాటు చేసుకుంటే పెద్ద పెద్ద సమస్యల పట్ల భయం కూడా తగ్గుతుంది.
భయాన్ని అధియమించడానికి నవ్వు ఒక శక్తివంతమైన సాధనం. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక దృఢత్వాన్ని, పాజిటివ్ ఆలోచనలను పెంచుతుంది. జీవితంలో నవ్వును ఒక భాగం చేసుకుంటే భయానికి చోటు ఉండదు. అంతేకాక ఆనందం, ధైర్యం మనతోనే ఉంటాయి.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే, తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నవారు వైద్యుడిని లేదా నిపుణులను సంప్రదించడం మంచిది.