ఏపీ రైతులకు జగన్ తీపికబురు చెప్పారు. ఇక తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అన్నదాతల సాగు అవసరాలను తీర్చి తక్కువ ధరకే వ్యవసాయ ఉపకరణాలను సమకూర్చే వైఎస్సార్ యంత్ర సేవా పథకం గుంటూరు వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… వ్యవసాయాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు 10,750 రైతు భరోసా కేంద్రాలలో అన్నదాతలకు కావాల్సిన పనిముట్లన్నీ తక్కువ ధరకు లభించేలా రైతులతో గ్రూపులు ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున 40 శాతం రాయితీ ఇస్తున్నామని వెల్లడించారు సీఎం జగన్. మరో 50 శాతం రుణాలను బ్యాంకులతో మాట్లాడి తక్కువ వడ్డీకే మంజూరు చేయిస్తున్నామని శుభవార్త చెప్పారు వైఎస్ జగన్. విత్తనం నుంచి పంట విక్రయం వరకు ప్రతి దశలోనూ రైతన్నలకు తోడుగా ఉండేందుకు ప్రతి గ్రామం లోనూ రైతు భరోసా కేంద్రాలను నిర్మించామని వెల్లడించారు వైఎస్ జగన్ మోహన్ రె డ్డి.