IPL 2023 : RCBతో మ్యాచ్​లో విజయం.. లక్నో టీమ్ సంబురాలు చూశారా..?

-

IPL 16వ సీజన్​లో సోమవారం రోజున రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం సాధించింది. కోహ్లీ, డుప్లెసిస్​ చెలరేగడంతో ఆర్సీబీ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని.. స్టొయినిస్​, పూరన్​ సాయంతో లఖ్‌నవూ 9 వికెట్లు కోల్పోయి చివరి బంతి వరకు పోరాడి మరీ ఛేదించింది. ఈ మ్యాచ్​లో ఉత్కంఠ రేపిన క్షణాలు.. ఆసక్తి కలిగించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్​ మధ్య జరిగిన పోరు.. స్టేడియంలో ఉన్న ఆడియెన్స్​తో పాటు టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది మంది క్రికెట్‌ ప్రియులను మునివేళ్లపై నిలుచోబెట్టిందీ​. ఇక ఓటమి తప్పదు అని ఫిక్స్ అయిన కేఎల్ రాహుల్ సేన చివరి నిమిషంలో పికప్ అయింది. భారీగా పరుగులు చేసిన బెంగళూరును చిత్తుగా ఓడించింది. అయితే ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఇంతటి టెన్షన్ మ్యాచ్​లో విజయతీరాలను చేసిన లక్నో జట్టు సంబురాల్లో మునిగిపోయింది. మరి ఆ చివరి నిమిషంలో రాహుల్ సేన ఎలా విజయం సాధించింది. గూస్​బంప్స్ తెప్పించిన ఆ చివరి క్షణాలను ఓసారి మీరూ చూసేయండి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news